ఫిబ్రవరి 16న భారత్ బంద్ ఎందుకో తెలుసా

ఫిబ్రవరి 16న భారత్ బంద్ ఎందుకో తెలుసా

2024, ఫిబ్రవరి 16వ తేదీ గ్రామీన భారత్ బంద్.. ఈ విషయం తెలుసా మీకు.. దేశ వ్యాప్త బంద్ కు రైతులు, ట్రేడ్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. అసలు 16వ తేదీ అంటే.. శుక్రవారం భారత్ బంద్ ఎందుకో తెలుసుకుందాం.

దేశంలోని రైతు సంఘాలు వారి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలుపుతూ ఛలో ఢిల్లి కార్యక్రమాన్ని ఫిబ్రవరి 13న ప్రారంభించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఈ పాదయాత్రకు మద్దతు తెలపాలని 200 రైతు సంఘాలకు పిలుపునిచ్చింది. హర్యాన, పంజాబ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతులు పార్లమెంట్ ముట్టడికి బయలుదేరారు. వీరిని అడ్డుకోవడానికి పరిస్థితులు చేయిదాటిపోయిన ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించారు.

Also Read: మేం ఐరన్ మ్యాన్ కాదయ్యా : శాండ్ విచ్ లో నట్లు, బోల్టులు

రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ  వైఖరిని ఖండిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఫిబ్రవరి 16న తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచేందుకు గ్రామీణ భారత్ బంద్ (దేశవ్యాప్త సమ్మె)కు చేపట్టనుంది. దేశ వ్యాప్తంగా ఈ బంద్ కు మద్దతు తెలపాలని రైతు సంఘాలను కోరింది. ఫిబ్రవరి 16న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామీణ భారత్ బంద్ పేరుతో దేశవ్యాప్త సమ్మె ప్రారంభం కానుంది. అదే రోజు పంజాబ్ లో రాష్ట్ర, జాతీయ రహదారులు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగు వరకు మూసివేస్తున్నట్లు నిరసన కారులు స్పష్టం చేశారు.